లైగర్ యూఎస్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి!

Published on Nov 26, 2021 12:40 am IST

విజయ్ దేవరకొండ హీరోగా, అనన్య పాండే హీరోయిన్ గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం లైగర్. సాలా క్రాస్ బ్రీడ్ అనేది ఈ చిత్రం ఉప శీర్షిక. ఈ చిత్రం ను పూరి జగన్నాథ్ మరియు ఛార్మి కౌర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ ఈ చిత్రం లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. చిత్ర యూనిట్ లాస్ వెగాస్ లో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ షెడ్యూల్ తాజాగా పూర్తి అయినట్లు తెలుస్తుంది. కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :

More