విజయ్ “లైగర్” మాస్ మేకింగ్ స్టిల్స్ రిలీజ్!

విజయ్ “లైగర్” మాస్ మేకింగ్ స్టిల్స్ రిలీజ్!

Published on Aug 10, 2022 2:07 PM IST


యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా లైగర్. సాలా క్రాస్ బ్రీడ్ ఉప శీర్షిక. ఈ చిత్రం ఆగస్ట్ 25, 2022 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ పాన్ ఇండియా మూవీ రిలీజ్ కి ఇంకా 15 రోజుల సమయం మాత్రమే ఉండటం తో చిత్ర యూనిట్ జోరుగా ప్రచారం చేస్తోంది.

ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సెన్సేషన్ రెస్పాన్స్ వస్తోంది. దేశ వ్యాప్తంగా చేస్తున్న ప్రమోషన్ల తో సినిమా పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ చిత్రం కి సంబంధించిన లేటెస్ట్ మాస్ మేకింగ్ స్టిల్స్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేయడం జరిగింది. ఈ స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్, రమ్య కృష్ణ లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు