“లైగర్” ఓవర్సీస్ డీల్ భారీ గానే?

Published on Jul 26, 2022 5:35 pm IST


మన టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “లైగర్” కోసం అందరికీ తెలిసిందే. డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సాలిడ్ యాక్షన్ డ్రామా మరో నెల రోజుల్లో రిలీజ్ కి సిద్ధంగా ఉండగా రీసెంట్ గా వచ్చిన ఈ సినిమా మాసివ్ ట్రైలర్ భారీ రెస్పాన్స్ ని పాన్ ఇండియా లెవెల్లో కొల్లగొట్టింది. ఇక ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతుండగా ఆల్రెడీ బిజినెస్ కూడా పూర్తి కావచ్చింది.

ఇండియా లో అయితే అన్ని భాషల్లో విజయ్ కెరీర్ లోనే రికార్డు మొత్తంతో బిజినెస్ జరుపుకోగా మేకర్స్ ఓవర్సీస్ లో కూడా భారీ మొత్తంలోనే అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ చిత్రానికి సుమారు 15 కోట్లకి పైగానే అన్ని భాషల్లో కలిపి మేకర్స్ చెబుతున్నారట. మరి అక్కడి హక్కులు ఎవరు సొంతం చేసుకుంటారు లేదా మేకర్స్ నుంచే ఓన్ రిలీజ్ ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి అయితే లైగర్ క్రేజ్ బాగానే క్యాష్ చేసుకునే పనిలో మేకర్స్ ఉన్నారని చెప్పాలి.

సంబంధిత సమాచారం :