కళ్లు చెదిరే రేంజ్‌లో “లైగర్” బిజినెస్?

Published on Feb 8, 2022 1:00 am IST

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “లైగర్”. ఈ భారీ పాన్ ఇండియన్ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ మరియు పూరి కనెక్ట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాయి.

తాజాగా ఈ సినిమా బిజినెస్ కళ్ళు చెదిరే రేంజ్‌లో జరిగినట్టు టాక్ నడుస్తోంది. ప్రముఖ ఓటిటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ లైగర్‌ని రూ.60 కోట్లు పెట్టి కొనుగోలు చేసిందంట. ఓటీటీ ద్వారానే ఈ స్థాయిలో ఆఫర్‌ని అందుకున్న ఈ చిత్రం థియేట్రికల్ మరియు శాటిలైట్ రైట్స్ ద్వారా ఏ స్థాయిలో లాభాలు అందుకుంటుందనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. కాగా ప్రముఖ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :