“లైగర్” ఫైనల్ మాసివ్ షెడ్యూల్ కి రంగం సిద్ధం.!

Published on Feb 4, 2022 7:00 pm IST

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పాండే హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం “లైగర్”. మాస్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో భారీ అంచనాలు నెలకొల్పుకుని ఉంది. మరి ఈ చిత్రాన్ని మేకర్స్ ఆల్ మోస్ట్ కంప్లీట్ చేసేసి పాన్ ఇండియా నుంచి వరల్డ్ లెవెల్ హంగులనే సెట్ చేస్తూ వస్తున్నారు.

మరి ఇలా ఈ చిత్రాన్ని ఇప్పుడు మేకర్స్ ఫైనల్ షెడ్యూల్ కి గాను తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. మరి ఈ షెడ్యూల్ కి గాను భారీ సెట్టింగ్ వేసి మాసివ్ గా తెరకెక్కిస్తున్న సెట్ తాలూకా ఫొటోస్ పెట్టి మరీ మేకర్స్ మరింత హైప్ తెప్పిస్తున్నారు. దీనితో ఈ ఫైనల్ షెడ్యూల్ ని గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది.

ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ పాన్ ఇండియా లెవెల్లో సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. మరి సినిమా అంతా ఎలా ఉంటుందా అని అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా వచ్చే ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కి రెడీ చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :