‘లైగర్’ తమిళ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ సంస్థ ..!

Published on Jul 27, 2022 6:33 pm IST

విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ లైగర్ పై ఇండియా వ్యాప్తంగా అన్ని భాషల ఆడియన్స్ లో సూపర్ గా అంచనాలు ఉన్నాయి. తొలిసారిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ చేస్తున్న ఈ భారీ పాన్ ఇండియా మూవీలో రమ్యకృష్ణ విజయ్ కి తల్లిగా కనిపించనుండగా ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు. యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కింది. విజయ్ దేవరకొండ ఈ మూవీ లో కిక్ బాక్సర్ గా కనిపించనున్నారు. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంస్థలపై పూరి తో కలిసి కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ మూవీ ట్రైలర్ లేటెస్ట్ గా యూట్యూబ్ లో రిలీజ్ అయి ప్రస్తుతం సెన్సేషనల్ గా అదరగొడుతూ దూసుకెళుతోంది.

ముఖ్యంగా సాంగ్స్, ట్రైలర్ రిలీజ్ తరువాత అందరిలో లైగర్ పై మరింతగా అంచనాలు పెరిగాయి అనే చెప్పాలి. ఇక ఈ మూవీకి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే, ఈ ప్రతిష్టాత్మక మూవీ యొక్క తమిళ రిలీజ్ రైట్స్ ని అక్కడి ప్రముఖ సంస్థ స్టూడియో 9 వారు భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అటు తమిళ్ లో విజయ్ కి మంచి ఫాలోయింగ్ ఉండడంతో పాటు లైగర్ ట్రైలర్ అక్కడి ఆడియన్స్, ఫ్యాన్స్ ని కూడా అలరించడంతో మూవీపై మరింత క్రేజ్ పెరిగింది. కాగా ఆగష్టు 25న భారీ స్థాయిలో అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కానుంది లైగర్.

సంబంధిత సమాచారం :