“లైగర్” టీం నుంచి మైక్ టైసన్ కి ఎనర్జిటిక్ విషెష్.!

Published on Jun 30, 2022 10:52 am IST


టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా మాస్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ చిత్రం “లైగర్”. పూరికి హిట్ ట్రాక్ అయినటువంటి బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మేకర్స్ షూటింగ్ ని కంప్లీట్ చేసి రీసెంట్ గానే లాస్ట్ సాంగ్ షూటింగ్ ని కూడా స్టార్ట్ చేశారు. అయితే ఈ చిత్రంలో ఉన్న భారీ తారాగణంతో ప్రపంచ దిగ్గజ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ కూడా కీలక పాత్రలో నటించారు.

అయితే ఇప్పుడు మైక్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో తనకి విశేషుని తెలియజేసారు మొదటగా సినిమా నిర్మాత కరణ్ జోహార్ నుంచి విజయ్ దేవరకొండ హీరోయిన్ అనన్య పాండే సహా ఛార్మీలు కూడా మైక్ కి స్పెషల్ విషెష్ ని తెలిపారు. అలాగే ఆన్ సెట్స్ లో మైక్ తో కలిసి ఉన్న కొన్ని వీడియో షాట్స్ కూడా చూపించడం మరింత ఆసక్తిగా మారింది. మొత్తానికి అయితే ఈ స్పెషల్ వీడియో మంచి వైరల్ అవుతుంది.

 

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :