లేటెస్ట్ : ‘లైగర్’ బుకింగ్స్ ఓపెనింగ్ పై క్రేజీ అప్ డేట్

లేటెస్ట్ : ‘లైగర్’ బుకింగ్స్ ఓపెనింగ్ పై క్రేజీ అప్ డేట్

Published on Aug 18, 2022 9:00 PM IST

ప్రారంభం నుండి అందరిలో సూపర్ గా క్రేజ్ ని సొంతం చేసుకుని, ఇటీవల ట్రైలర్, సాంగ్స్, టీజర్, పోస్టర్స్ రిలీజ్ తరువాత మరింత భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరుచుకున్న మూవీ విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన లైగర్ లో అనన్య పాండే హీరోయిన్ గా నటించగా వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ ఇందులో కీలక రోల్ చేసారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సాగె యాక్షన్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ సాగనుండగా డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దీనిని గ్రాండ్ గా తెరకెక్కించారు.

ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ కలిసి నిర్మించిన లైగర్ ఆగష్టు 25న విడుదల కానుండగా, అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ఈ మూవీ యొక్క టికెట్ బుకింగ్స్ ని ఆగష్టు 20 నుండి ప్రారంభించనున్నారు. మరోవైపు అదే రోజున ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులోని మోతడక గ్రామంలో గల చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గ్రౌండ్స్ లో భారీ స్థాయిలో జరుగనుంది. ప్రస్తుతం భారతదేశంలోని పలు ముఖ్య ప్రాంతాల్లో ఫ్యాన్డం టూర్స్ చేస్తున్న లైగర్ టీమ్, తప్పకుండా రిలీజ్ తరువాత మూవీ అందరినీ ఆకట్టుకోవడం ఖాయం అంటోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు