లయన్ షోలో “లైగర్”..అన్ స్టాప్పబుల్ కొత్త ప్రోమోకి ఆల్ సెట్.!

Published on Jan 7, 2022 9:00 am IST

మన తెలుగు మొట్ట మొదటి ఓటిటి సక్సెస్ ఫుల్ ఓటిటి యాప్ “ఆహా” ఇప్పుడు మరింత బెస్ట్ వెబ్ కంటెంట్ తో దూసుకెళ్తుంది అని చెప్పాలి. ఎప్పటికప్పుడు సరికొత్త ప్రయోగాలతో ఎంటర్టైన్ చేస్తున్న ఈ ప్లాట్ ఫామ్ లో మొట్ట మొదటి సారిగా నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ఒక వ్యాఖ్యాతగా షో ని హోస్ట్ చెయ్యడం ఇక్కడ నుంచే జరిగింది. టాలీవుడ్ ప్రముఖ సినీ తారలతో బాలయ్య హోస్ట్ చేస్తున్న ఈ షో నే “అన్ స్టాప్పబుల్”.

మరి ఇప్పటికే పలు సూపర్ హిట్ ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ కి రాగా ఇప్పుడు మరో ఆసక్తికర ఎపిసోడ్ కి రంగం సిద్ధం అయ్యింది. ఈ కొత్త ఎపిసోడ్ లో లయన్ బాలయ్యని లైగర్ విజయ్ దేవరకొండ ఫేస్ చెయ్యనున్నాడు. లేటెస్ట్ గానే షూట్ కంప్లీట్ అయ్యిన ఈ సాలిడ్ ఎపిసోడ్ తాలూకా ప్రోమో కూడా త్వరలోనే రిలీజ్ చెయ్యబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే ఈ షోలో వీరి ఫోటో వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :