విజయ్ దేవరకొండ స్పోర్ట్స్ డ్రామా లైగర్, కాగా ఈ సినిమా టైటిల్ ప్రకటించినప్పటి నుంచి ప్రేక్షకుల నుండి విపరీతమైన స్పందన వస్తోంది. పైగా టీజర్ కూడా ఈ సినిమాపై అంచనాలను పెంచింది. ఇక సినిమా ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాగా సుప్రసిద్ధ సాండ్ ఆర్టిస్ట్ దశరథ్ మొహంతా ఒడిశాలో లైగర్ టైటిల్ ను ఇసుకలో ఒక ఆర్ట్ లా చెక్కాడు. అలాగే విజయ్ దేవరకొండ మరియు మైక్ టైసన్ ఫేస్ లను కూడా బాగా డిజైన్ చేశాడు. అందుకే ఈ ఆర్ట్ కి విజయ్ దేవరకొండ అభిమానుల నుంచి భారీ స్పందన వస్తోంది.
ఇక ఈ చిత్రాన్ని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. లైగర్ కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి అయ్యాడు. ఇక విజయ్ దేవరకొండ చాలా రోజుల నుంచి బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి హిట్ ను ఇస్తుందో చూడాలి.