హీరో సూర్య హీరోగా రాబోతున్న చిత్రం ‘కంగువా’. శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానున్న ఈ ఎపిక్ యాక్షన్ డ్రామా ప్రమోషన్‌లు జోరందుకున్నాయి. ప్రస్తుతం హీరో సూర్య, దిశా పఠానీ, బాబీ దేవోల్ లతో కలిసి ఢిల్లీలో సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరో సూర్య, వందల మంది అభిమానులతో కలిసి దిగిన సెల్ఫీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సెల్ఫీలో దిశా పఠానీ, బాబీ దేవోల్ కూడా ఉండడం విశేషం.
అన్నట్టు, ఈ నెల అక్టోబర్ 26న వేవ్ మీడియా ఇండియా ద్వారా ‘కంగువా ఆడియో లాంచ్ ఈవెంట్’ గ్రాండ్ గా జరగబోతుంది. కాగా ఈ సినిమాలో దిశా పఠానీ కథానాయికగా నటిస్తోంది. బాబీ దేవోల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. అయితే, ఇప్పటికే, పార్ట్ 2, పార్ట్ 3 కథలు సిద్ధంగా ఉన్నాయని, కంగువా పార్ట్ 1 విజయం ఆధారంగా వాటిని తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నామని నిర్మాత కేఈ జ్ఞానవేల్ చెప్పుకొచ్చారు.