‘అలవైకుంఠపురములో’ మాదిరిగా ‘గుంటూరు కారం’ కి కూడా ?

Published on Jun 8, 2023 1:30 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ కమర్షియల్ మూవీ గుంటూరు కారం. మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ పై సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన మాస్ స్ట్రైక్ గ్లింప్స్ అందరినీ విశేషంగా ఆకట్టుకుని మూవీ పై ఇప్పటివరకు ఉన్న అంచనాలు అమాంతం పెంచేసింది.

విషయం ఏమిటంటే, అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ గత సూపర్ హిట్ మూవీ అలవైకుంఠపురములో మ్యూజికల్ గా కూడా సెన్సేషనల్ సక్సెస్ అందుకుంది. ఇక ఆ మూవీ నుండి ఫస్ట్ సాంగ్ ని సినిమా రిలీజ్ కి మూడు నెలల ముందే రిలీజ్ చేసారు. అక్కడి నుండి మూవీలోని ఒక్కో సాంగ్ ని రిలీజ్ చేస్తూ వచ్చారు యూనిట్. మ్యూజిక్ సూపర్ గా ఆడియన్స్ ని ఆకట్టుకోవడం అలానే జనవరి 2020 లో రిలీజ్ అయిన మూవీ కూడా అంచనాలు అందుకోవడంతో అది సూపర్ హిట్ కొట్టింది. కాగా అదే విధమైన స్ట్రాటజీని గుంటూరు కారం కోసం అనుసరించనున్నారట మేకర్స్.

ఈ రోజుల్లో ఏ సినిమా సక్సెస్ కి అయినా మ్యూజిక్ ముఖ్య పాత్ర పోషిస్తుండడంతో గుంటూరు కారం నుండి కూడా రెండు లేదా మూడు నెలల ముందు నుండే సాంగ్స్ రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్. మరోవైపు థమన్ ఈమూవీ కి ఐదు అదిరిపోయే ట్యూన్స్ సిద్ధం చేశారట. మరి ఇదే కనుక నిజం అయితే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఇది సూపర్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ న్యూస్ పై గుంటూరు కారం నిర్మాతలైన హారికా హాసిని క్రియేషన్స్ వారి నుండి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ మూవీని 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :