చైతూకు లైన్ క్లియర్ చేసిన గౌతమ్ మీనన్!
Published on Oct 23, 2016 5:41 pm IST

gautham-menon
దసరా కానుకగా ‘ప్రేమమ్’ సినిమాతో వచ్చి హిట్ కొట్టేసిన నాగ చైతన్య హీరోగా నటించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ అన్న సినిమా కూడా ఈ నెల్లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ వర్షన్ కాస్త ఆలస్యమవుతూ రావడంతో తెలుగు వర్షన్ కూడా విడుదలకు నోచుకోకుండా వచ్చింది. ఇక ఇప్పుడు తమిళ వర్షన్ కూడా అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకోవడంతో గౌతమ్ మీనన్ ఈ సినిమాను నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

ఇదే విషయాన్ని గౌతమ్ మీనన్ స్వయంగా తెలియజేస్తూ సాహసం శ్వాసగా సాగిపో నవంబర్‌లో విడుదలవుతుందని తెలిపారు. తమిళ వర్షన్‌లో శింబు హీరోగా నటించారు. ఇక ఈ మధ్యాహ్నమే ఒక కొత్త ట్రైలర్‌ను కూడా విడుదల చేసి గౌతమ్ మీనన్ ప్రమోషన్స్‌కు శ్రీకారం చుట్టారు. ఏ మాయ చేశావే లాంటి క్లాసిక్ హిట్ తర్వాత చైతూ, గౌతమ్ మీనన్‌ల కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో సాహసం శ్వాసగా సాగిపోపై మొదట్నుంచీ మంచి అంచనాలున్నాయి. ఏ.ఆర్.రెహమాన్ అందించిన ఆడియో ఇప్పటికే సూపర్ హిట్ అయింది. ప్రేమమ్‌తో హిట్ కొట్టిన చైతూ, ఈ సినిమాతో అది కొనసాగిస్తారా లేదా అన్నది చూడాలి.

 
Like us on Facebook