ఆగష్టు 18 నుంచి రజినీ ‘లింగా’ క్లైమాక్స్ షూట్

Rajinikanth-anushka
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న సినిమా ‘లింగా’. గత వారమే ఈ మూవీ లాంగ్ హైదరాబాద్ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. ప్రస్తుతానికి షూటింగ్ కి కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ చిత్ర టీం ఆగష్టు 18 నుంచి ఈ మూవీ క్లైమాక్స్ ఎపిసోడ్ ని కర్ణాటకలోని శిమోఘలో ప్రారంభించనున్నారు. ఈ క్లైమాక్స్ షెడ్యూల్లో రజినీకాంత్ తో పాటు అనుష్క, సొనక్షి సిన్హా, మిగిలిన ప్రముఖ నటీనటులు కూడా పాల్గొననున్నారు.

శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాలోని మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తయ్యింది. కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రజినీకాంత్ డ్యూయల్ రోల్లో కనిపించనున్నాడు. అందులో ఒక పాత్ర ప్రస్తుతానికి సంబందించినది అయితే, మరొకటి 1940కి చెందిన పాత్ర. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత. దీపావళి కానుకగా ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది.

Exit mobile version