2000కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానున్న రజినీ ‘లింగ’

Linga
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ – కమర్షియల్ డైరెక్టర్ కెఎస్ రవికుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘లింగ’. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా దాపు పూర్తి చేసుకున్న ఈ సినిమా తమిళ వెర్షన్ కి సెన్సార్ బోర్డు క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ ఇచ్చింది. రజినీకాంత్ బర్త్ డే కానుకగా డిసెంబర్ 12న ‘లింగ’ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.

రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ప్రసతుతం ఉన్న థియేటర్స్ సమాచారం ప్రకారం ఈ సినిమాని అన్ని భాషల్లో కలిపి సుమారు 2000కి పైగా థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి ఈ చిత్ర టీం సన్నాహాలు చేస్తోంది. రిలీజ్ లోపు మరికొన్ని థియేటర్స్ కూడా పెరిగే అవకాశం ఉంది.

కెఎస్ రవికుమార్ – రజినీకాంత్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండడంతో ప్రీ రిలీజ్ బిజినెస్, ఎక్కువ థియేటర్స్ తో డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు వస్తున్నారు. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత.

Exit mobile version