‘లింగ’తో అభిమానులకు రజినీకాంత్ డబల్ బొనంజా.

lingaa-sencor
‘కొచ్చాడియాన్’ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ యానిమేషన్ చూసి నిరాశ చెందిన అభిమానులకు ఇది సంతోషం కలిగించే వార్త. రజిని నటించిన తాజా సినిమా ‘లింగ’ నిడివి 175 నిముషాలు. అంటే సుమారు మూడు గంటల పాటు సూపర్ స్టార్ తెరపై సందడి చేయనున్నారు. దీనికి తోడు డ్యూయల్ రోల్ లో నటించడం బోనస్. ఇటివలే ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ లభించింది.

గతంలో రజినీకాంత్ తో ‘ముత్తు’, ‘నరసింహ’ వంటి సూపర్ హిట్స్ అందించిన కెఎస్ రవికుమార్ ‘లింగ’ సినిమాకు దర్శకుడు. సోనాక్షి సిన్హా, అనుష్క హీరోయిన్లుగా నటించారు. ఏఅర్ రెహమాన్ సంగీత దర్శకుడు. రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత. రజినీకాంత్ పుట్టినరోజున, డిసెంబర్ 12న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

Exit mobile version