‘లైగర్’ సెట్స్ లోకి లయన్ సడెన్ సర్ప్రైజ్.!

Published on Sep 22, 2021 1:30 pm IST

సెన్సేషనల్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో “లైగర్” అనే భారీ పాన్ ఇండియన్ సినిమా ఇప్పుడు తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం షూట్ ఇటీవల గోవాలో మళ్ళీ స్టార్ట్ అయ్యింది. అయితే ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా సెట్స్ లో నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చి సడెన్ సర్ప్రైజ్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

తన హ్యాట్రిక్ సూపర్ హిట్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో తీస్తున్న సాలిడ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా “అఖండ” కూడా గోవాలోనే షూట్ జరుపుకుంటుందని టాక్ ఉంది. మరి అలా బహుశా వీరి కలయిక జరిగి ఉండొచ్చు. దీనితో లైగర్ మేకర్స్ ఈ విషయాన్ని చాలా ఎగ్జైటింగ్ గా పంచుకున్నారు. బాలయ్య తమ టీం ని కలిసి సినిమాని బ్లెస్ చేసారని కూడా తెలిపారు.

మరి ఇది వరకే బాలయ్య మరియు పూరీలా కాంబోలో “పైసా వసూల్” అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. దీని తర్వాత కూడా వీరి కాంబో నుంచి మరో సినిమా రానుంది అని కూడా ఇండస్ట్రీ వర్గాల్లో బజ్ ఉంది. మరి ఇదెప్పుడు జరుగుతుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే బాలయ్య లైగర్ సెట్స్ లో ఉన్న ఫోటోలే వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :