
నందమూరి నట సింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా సినిమా ‘లయన్’ శాటిలైట్ హక్కులు విడుదలకు ముందే అమ్ముడయ్యాయి. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ జెమినీ 6 కోట్లకు ‘లయన్’ శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది.
సిబిఐ ఆఫీసర్ పాత్రలో బాలకృష్ణ అభినయం అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం చెప్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, బాలయ్య డైలాగులు సినిమాపై అంచనాలను పెంచాయి. ప్రస్తుత రాజకీయ కోణాన్ని సినిమాలో చూపుతారా..? అనే ప్రశ్న అందరి మదిలో ఉంది.
త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు సత్యదేవా దర్శకుడు. రుద్రపాటి రమణారావు నిర్మాత. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. మార్చి 28న ఆడియోను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. సినిమా ఏప్రిల్ నెలలో విడుదల చేయనున్నారు.