మెగాస్టార్ “భోళా శంకర్”లో ఛాన్స్ పట్టేసిన లోబో..!

Published on Dec 8, 2021 9:00 pm IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వేదాళం రీమేక్ ‘భోళా శంకర్’ సినిమాలో లోబో ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తుంది. ‘హైదరాబాదీ ఎక్స్‌ప్రెస్‌’ షోకు యాంకర్‌గా వ్యవహరించి తనకంటూ మాస్ క్రేజ్ తెచ్చుకున్న లోబో ఆ తర్వాత స్క్రీన్ మీద పెద్దగా కనిపించలేదు. అయితే బిగ్‌బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన లోబో దాదాపు 8 వారాల పాటు హౌస్‌లో ఉండి ప్రేక్షకులను బాగానే ఎంటర్‌టైన్ చేశాడు.

అయితే ఈ మధ్యే మెగాస్టార్ చిరంజీవి లోబోను పిలిచి మరీ నా సినిమాలో ఛాన్స్‌ ఉంది, చేయమని అడిగారని లోబో ఓ ఇంటర్వ్యూలో చెప్పి భావోద్వేగానికి గురయ్యాడు. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహిస్తున్న ‘భోళా శంకర్‌’ సినిమాలో చిరంజీవి గారిని అంటిపెట్టుకుని ఉండే పాత్ర నాదని, నిజంగా మెగస్టార్ పక్కన నటించడం అంటే తన కల నెరవేరినట్లేనని లోబో చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం :