ఇటీవల దక్షిణాది సినిమా దగ్గర వచ్చి సూపర్ డూపర్ హిట్ అయ్యిన పలు చిత్రాల్లో దర్శకుడు లోకేష్ కనగరాజ్ హీరోగా నటించిన మొదటి చిత్రం డిసి కూడా ఒకటి. దర్శకుడు అరుణ్ మాదేశ్వరన్ తెరకెక్కించిన ఈ ఇంటెన్స్ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా 100 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టి అదరగొట్టింది. అయితే ఈ సినిమా ఫైనల్ గా థియేటర్స్ నుంచి ఓటీటీకి వచ్చేసింది.
ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు సినిమా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారి ఓటీటీ సంస్థ సన్ నెక్స్ట్ వారే సొంతం చేసుకున్నారు. ఇక అందులో నేటి నుంచి ఈ సినిమా అందుబాటులోకి వచ్చేసింది. సో ఈ క్రేజీ మ్యూజికల్ యాక్షన్ డ్రామాని చూడాలి అనుకునేవారు డెఫినెట్ గా ఇప్పుడు ఓటీటీలో చూడొచ్చు. ఇక ఈ సినిమాలో సంజన కృష్ణమూర్తి అలాగే వామికా గబ్బి హీరోయిన్స్ గా నటించగా అనిరుద్ మ్యాడ్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా అప్పుడు ఎవరైనా మిస్ అయితే మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా ఓటీటీలో చూసేయ్యండి.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
