లియో : లోకేశ్ అండ్ టీమ్ ఈ అంశాన్ని సరిగ్గా గురిపెట్టారు

Published on Feb 4, 2023 11:00 pm IST


లేటెస్ట్ గా ఇళయదళపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో లియో మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై ఎంతో భారీ వ్యయంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. ఇక నిన్న ఈ మూవీ యొక్క ట్రైలర్ ని అఫీషియల్ గా ఒక అనౌన్స్ మెంట్ వీడియో ద్వారా రిలీజ్ చేసారు. అయితే ఈ ప్రతిష్టాత్మక మూవీకి లియో టైటిల్ పెట్టడం పై దర్శకుడు లోకేష్ అండ్ టీమ్ తెలివైన ఆలోచనే చేసారని అంటున్నాయి సినీ వర్గాలు.

నిజానికి ఇటీవల వచ్చిన పాన్ ఇండియన్ మూవీస్ అయిన కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్, పుష్ప మాదిరిగా ఇంగ్లీష్ అక్షరాలు వచ్చేలా అలానే చాలా సింపుల్ గా అందరికీ అర్ధం అయ్యే రీతిలో ఈ టైటిల్ ఎంచుకోవడంతో మెజారిటీ ఆడియన్స్ కి ఇది కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే ఈ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ ప్రోమోకి ఏకంగా 27 మిలియన్ వ్యూస్ దక్కడంతో మూవీ ఆకట్టుకునే కథ, కథనాలతో తెరకెక్కితే పాన్ ఇండియన్ రేంజ్ లో తప్పకుండా మెజారిటీ ఆడియన్స్ యొక్క మెప్పు సొంతం చేసుకునే ఛాన్స్ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి అక్టోబర్ 19న విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :