“అవతార్” కే స్టార్ట్ చేసినా ఇంకా “ఆదిపురుష్” కి స్టార్టవ్వలేదు.!

Published on Jul 2, 2022 3:03 pm IST

ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న భారీ చిత్రాల్లో పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ లెవెల్లో రిలీజ్ కి సిద్ధం అవుతున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది “ఆదిపురుష్” అనే చెప్పాలి. అలాగే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మరో మోస్ట్ అవైటెడ్ చిత్రం “అవతార్ 2” కూడా ఒకటి.

మరి ఈ సినిమా తరహాలో చాలా కొత్త టెక్నాలజీలు గ్రాండ్ అండ్ రియలిస్టిక్ విజువల్స్ తో ఆదిపురుష్ ని తీస్తున్నట్టుగా ఆ మధ్య టాక్ వచ్చింది. మరి ఇదంతా బాగానే ఉన్నా అలాంటి అవతార్ సినిమా ఈ ఏడాది చివర 2022 డిసెంబర్ లో రిలీజ్ అవుతుండగా వారు ఇప్పుడు నుంచే సోషల్ మీడియాలో యమ యాక్టీవ్ గా ప్రమోషన్స్ ని కొత్త పోస్టర్స్ అని హడావుడి చేస్తున్నారు.

కానీ ఆదిపురుష్ కి ఆ సినిమాతో పోలిస్తే మూడు వారాల గ్యాప్ కూడా లేదు అయినా ఇంకా ఈ సినిమా నుంచి టీజర్ కాదు కదా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా బయటకి రాలేదు. అలాంటి అవతార్ యూనిట్ నే ఇప్పుడు నుంచి తమ సినిమా ప్రమోషన్స్, హైప్ స్టార్ట్ చేసుకుంటుంటే ఆదిపురుష్ మేకర్స్ మాత్రం ఇంకా సైలెంట్ గా ఉండడం ఆశ్చర్యంగానే ఉంది. ఈ ఒక్క విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా దర్శకుడు ఓంరౌత్ విషయంలో డిజప్పాయింట్ గానే ఉన్నారు. మరి ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో చూడాలి.

సంబంధిత సమాచారం :