శ్రీకృష్ణుని ఆశీస్సులే ‘కార్తికేయ – 2’ ని సక్సెస్ చేసాయి – హీరో నిఖిల్

Published on Aug 13, 2022 10:00 pm IST

నిఖిల్ సిద్దార్ధ, అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ కార్తికేయ 2. యాక్షన్ థ్రిల్లింగ్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కిన ఈ మూవీలో అనుపమ్ ఖేర్, ఆదిత్య మీనన్, శ్రీనివాసరెడ్డి, హర్ష చెముడు, ప్రవీణ్, సత్య, తులసి తదితరులు ఇతర పాత్రలు చేసారు. కాల భైరవ సంగీతం అందించిన ఈ మూవీ శ్రీకృష్ణుని ద్వారక కథాంశంతో తెరకెక్కింది. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ కొన్నేళ్ల క్రితం రిలీజ్ అయి మంచి సక్సెస్ కొట్టిన కార్తికేయ కి సీక్వెల్ గా తెరకెక్కింది. టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీకి చందూ మొండేటి దర్శకుడు. ఇక నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తికేయ 2 సూపర్ హిట్ టాక్ తో కొనసాగుతూ ఉండడంతో యూనిట్ కొద్దిసేపటి క్రితం సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా హీరో నిఖిల్ మాట్లాడుతూ, రెండున్నరేళ్లుగా యూనిట్ మొత్తం కూడా కార్తికేయ 2 కోసం ఎంతో కష్టపడ్డాం అని, అలానే దర్శకుడు చందూ, నిర్మాతలు సహా ప్రతి ఒక్కరి కష్టానికి తగ్గ ఫలితం ప్రస్తుతం ప్రేక్షకులు అందించినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. నిజానికి సాక్ష్యాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి దీవెనలు ఆశీస్సులే ఈ మూవీని ఇంత పెద్ద సక్సెస్ చేశాయన్నారు. మన భారతీయ సనాతన ధర్మం, సంస్కృతి, సంప్రదాయాలను గుర్తు చేస్తూ సాగె మా సినిమా ప్రతి ఒక్కరు చూడాలని అన్నారు. రాత్రి నుండి తనకు వరుసగా కాల్స్, మెసేజ్ లు వస్తూనే ఉన్నాయని, ప్రతి ఒక్కరు కూడా సినిమా ఎంతో గొప్పగా ఉందని అభిప్రాయపడుతున్నారన్నారు. తమకి ఇంత గొప్ప విజయం అందించిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి పేరు పేరునా ధన్యవాదాలు చెప్పారు హీరో నిఖిల్.

సంబంధిత సమాచారం :