“RRR”…యూఎస్ థియేటర్ ని మాస్ బ్లాస్ట్ గా మార్చేసిన ఆడియెన్స్.!

“RRR”…యూఎస్ థియేటర్ ని మాస్ బ్లాస్ట్ గా మార్చేసిన ఆడియెన్స్.!

Published on Oct 1, 2022 2:00 PM IST

ప్రపంచ వ్యాప్తంగా RRR సినిమా మ్యానియా ఏ లెవెల్లో ఉందో చెప్పడానికి ప్రతి రోజు కూడా ఏదో ఒకటి ఎక్కడో ఒకదా దగ్గరనుంచి వస్తూనే ఉన్నాయి. మరి మార్చ్ లో రిలీజ్ అయ్యిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ చిత్రం విషయంలో మాత్రం ఓ రేంజ్ లో హై అభిమానులకి వస్తుంది.

ఇక లేటెస్ట్ గా అయితే లాస్ ఏంజెల్స్ లో దర్శకుడు రాజమౌళి సమక్షలో ఓ భారీ స్పెషల్ షో ప్లాన్ చేసుకోగా దానికి అక్కడి విదేశీ ఆడియెన్స్ నుంచి నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ వస్తుండడం ఆసక్తిగా మారింది. షో కి ముందే ఎన్నో గంటలు నుంచి ఆడియెన్స్ నిలవడం ఒకెత్తు అయితే ఇప్పుడు థియేటర్ లో నాటు నాటు సాంగ్ కి ఆడియెన్స్ దాన్ని మాస్ థియేటర్ చేసి వదిలారు.

దీనితో మన తెలుగు స్టేట్స్ హంగామా తరహాలో అక్కడ కనిపిస్తుంది. దీనితో ఈ విజువల్స్ ఇప్పుడు అక్కడి మీడియా నుంచి వైరల్ గా మారాయి. మొత్తానికి అయితే రాజమౌళి, రామ్ చరణ్, రామారావు ల వర్క్ మాత్రం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమాని మరో స్థాయిలో నిలబెట్టింది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు