ఈ శుక్రవారం తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ‘లౌక్యం’ చిత్రబృందం సిద్ధమవుతుంది. సినిమాకు అంతర్లీనంగా మంచి టాక్ నడుస్తున్నా సాధారణంగా ప్రతీ చిత్ర బృందానికి వుండే టెన్షన్ వీరిలో సైతం కనిపిస్తుంది
కానీ సినిమాలో తాము అందించిన కామెడీ డోస్ చిత్రాన్ని తప్పకుండా కాపాడుతుందని వీరు నమ్మకంగా వున్నారు. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేస్తున్న సినిమాలేమి లేని తరుణంలో వీరి అంచనా నిజమైతే కుటుంబసమేతంగా చూడదగ్గ సినిమాగా లౌక్యం నిలిచే ఛాన్స్ వుంది
శ్రీవాస్ ఈ సినిమాకు దర్శకుడు. గోపీచంద్ హీరో.
