“లవ్ స్టోరీ” 12 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్ ఎలా ఉన్నాయంటే..!

Published on Oct 7, 2021 3:01 am IST


అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ చిత్రాల స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన “లవ్ స్టోరీ” సినిమా సెప్టెంబర్‌ 24న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్‌ని తెచ్చుకున్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన పెద్ద సినిమా ఇదే. అయితే థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా? కలెక్షన్లు ఎలా ఉంటాయోనని అందరిలో ఒకింత అనుమానం ఉండేది.

అయితే ఈ సినిమా థియేట్రికల్ హక్కులను 31 కోట్లకు అమ్మగా ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఇంత మేరకు కలెక్షన్లు కష్టమే అనిపించింది. కానీ అందరి అనుమానాలను పటా పంచలు చేస్తూ ఈ సినిమా 32 కోట్ల షేర్ వసూలు చేసి బ్రేక్ ఈవెన్ సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా 12 రోజుల్లోనే ఈ సినిమా 32.34 కోట్ల వరకు షేర్ వసూలు చేసి లాభాల్లోకి వచ్చింది.

‘లవ్ స్టోరీ’ 12 డేస్ కలెక్షన్స్

నైజాం: 11.87 కోట్లు
సీడెడ్: 4.24 కోట్లు
ఉత్తరాంధ్ర: 2.87 కోట్లు
గుంటూరు: 1.48 కోట్లు
కృష్ణా: 1.34 కోట్లు
ఈస్ట్: 1.57 కోట్లు
వెస్ట్: 1.33 కోట్లు
నెల్లూరు: 0.84 కోట్లు

ఏపీ మరియు తెలంగాణలో = 25.54 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా = 1.94 కోట్లు
ఓవర్సీస్ = 4.92 కోట్లు
వరల్డ్ వైడ్ కలెక్షన్స్ = 32.34 కోట్ల షేర్

సంబంధిత సమాచారం :