అడ్వాన్స్ బుకింగ్స్‌తో దూసుకెళ్తున్న “లవ్ స్టోరీ”..!

Published on Sep 18, 2021 3:01 am IST


అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ చిత్రాల స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన “లవ్ స్టోరీ” చిత్రం ఈ నెల 24వ తేదిన థియేటర్లలో విడుదల కాబోతుంది. అయితే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్, టీజర్, పాటలు సినిమాపై మరిన్ని అంచనాలు పెంచగా, మొన్న విడుదలైన ట్రైలర్‌కు కూడా భారీ స్పందన లభించింది. ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొండంతో చాలా రోజుల తర్వాత అడ్వాన్స్ బుకింగ్స్‌తో హైదరాబాద్‌లోని థియేటర్లు హౌస్‌ఫుల్ అయిపోతున్నాయి.

హైదరాబాద్‌లో ఉన్న థియేటర్లలో మొదటి రోజు 245 షోలలో 85 షోలు ఫాస్ట్‌గా బుకింగ్స్ అయిపోయాయి. మహేష్ బాబు ఆంభ్ సినిమాస్‌లో కూడా ఇప్పటికే 6,000 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. దాదాపు 35 శాతం ఆక్యుపెన్సీతో ముందుగానే థియేటర్లు ఫుల్ అయ్యాయి. మొత్తానికి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనమైన ఓపెనింగ్స్‌పై కన్నేసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 19న జరగనుంది.

సంబంధిత సమాచారం :