నేటి నుండి ఆహా వీడియో లో “లవ్ స్టోరీ”

Published on Oct 22, 2021 5:00 pm IST

నాగ చైతన్య మరియు సాయి పల్లవి హీరో హీరోయిన్ లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లవ్ స్టోరీ. రొమాంటిక్ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అమిగోస్ క్రియేషన్స్ మరియు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై నారాయణ్ దాస్ కే నారంగ్ మరియు పుస్కుర్ రామ్ మోహన్ రావు లు సంయుక్తంగా నిర్మించారు. పవన్ సి హెచ్ ఈ చిత్రానికి సంగీతం అందించడం జరిగింది.

ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ఘన విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం నేటి నుండి ఆహా వీడియో లో డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకులను, అభిమానులను అలరించనుంది. నేడు సాయంత్రం 6 గంటల నుండి ఇక ప్రేక్షకులకి అందుబాటులో ఉండటం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More