ఆహా వీడియో లోకి త్వరలో “లవ్ స్టోరీ”

Published on Oct 10, 2021 8:30 pm IST

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్ లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం లవ్ స్టోరీ. ఈ చిత్రం ధియేటర్లలో విడుదల అయ్యి ఘన విజయం సాధించింది. ఇంకా పలు చోట్ల హౌజ్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. అయితే ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా ప్రముఖ ఓటిటి సంస్థ అయిన ఆహా వీడియో లో స్ట్రీమ్ కానుంది.

ఈ నెల 22 వ తేదీ నుండి ఆహా వీడియో లో స్ట్రీమ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంకా ఈ విషయం పై ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఓటిటి విడుదల తేదీ పై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ చిత్రం విడుదల అయిన అన్నీ చోట్ల సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. యూ ఎస్ ప్రీమియర్స్ లో సైతం సత్తా చాటింది ఈ లవ్ స్టోరీ.

సంబంధిత సమాచారం :