ఇంటర్వ్యూ: నాగ చైతన్య తో చేయడం చాలా ఫెంటాస్టిక్ గా అనిపించింది – లవ్ స్టోరీ నిర్మాతలు

Published on Sep 17, 2021 2:50 pm IST

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం లవ్ స్టోరీ. ఈ చిత్రం ఈ నెల 24 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి పతాకం పై నారాయణ్ దాస్ నారంగ్ మరియు పుస్కుర్ రామ్ మోహన్ రావు లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం విడుదల కి సిద్దం అవుతుండటం తో నిర్మాతలు తాజాగా సినిమా కి సంబందించిన విశేషాలను వివరించారు.

శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మేం ఇద్దరం కలిసి మొదలు పెట్టాం. ఇందులో లవ్ స్టోరీ మా మొదటి ప్రాజెక్ట్. ఇంకా చాలా సినిమాలు నిర్మించనున్నాము. కరోనా వైరస్ కారణం గా లవ్ స్టోరీ సినిమా తరచూ వాయిదా పడుతూ వస్తుంది. థియేటర్ల లోనే విడుదల చేయాలనే ఉద్దేశ్యం మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో టికెట్ల ధరల విషయం లో ఆలోచించి వాయిదా వేశాం, ఈసారి ఏదేమైనా సినిమా ను 24 కి తీసుకు వస్తున్నాం.

పవన్ కళ్యాణ్ సినిమా తర్వాత అనుకున్నాం, కానీ థియేటర్లు బంద్ అవ్వడం తో ఈ ఏడాది పోస్ట్ పొన్ అయింది. వకీల్ సాబ్ చిత్రం తర్వాత మరొకసారి థియేటర్లు బంద్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ సినిమా గురించి చెబుతారా?

ఈ సినిమాలో పాటల విషయానికి వస్తే చాలా చాలా పెద్ద హిట్. సినిమా విడుదల కి ముందే సాంగ్స్ ఈ రేంజ్ లో హిట్ అవ్వడం ఇదే మొదటి సారి. శేఖర్ కమ్ముల గారు అన్ని సినిమాల లాగా కొంచెం లవ్ స్టోరీ కాకుండా కొన్ని విషయాల గురించి చూపించ నున్నారు. అనుకున్న దానికంటే ఎక్కువ రోజులు షూటింగ్ చేయాల్సి వచ్చింది కరోనా కారణంగా. అంతేకాక ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా నాలుగు షో లను పది గంటల లోపే ప్రదర్శించ నున్నాం.

ఈ సినిమా నిడివి రెండు గంటల 30 నిమిషాలు. ఫిదా టైం లో శేఖర్ కమ్ముల గారిని కలిసి ఈ సినిమా గురించి అడగడం జరిగింది. ఈ సినిమాకి మాత్రమే కాకుండా, వచ్చే ఏడాది ధనుష్ తో చేయబోయే సినిమా కి కూడా శేఖర్ కమ్ముల గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రం తర్వాత మరొక సినిమా కూడా మా కాంబో లో వస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. ఫిదా లో చేసిన సాయి పల్లవి గారే మళ్ళీ ఈ సినిమా కి ఒకే అనుకొని తీసుకోవడం జరిగింది.

మొత్తం నైజాం 250, ఆంధ్ర 300 థియేటర్ల లో సినిమాను విడుదల చేయనున్నాం. అదే విధంగా థియేటర్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి. డిపెండ్స్ ఆన్ ఓపెన్ చేసే అవకాశం ఉంది.

పాగల్ మరియు SR కళ్యాణ మండపం చిత్రాలు చిన్నవే అయినా, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కలెక్షన్స్ బాగా వచ్చాయి. వాళ్ళ ద్వారా సినిమాలు విడుదల చేయోచ్చు అనే రూట్ ఏర్పడింది అని అన్నారు. సీటీ మార్ కి కూడా ఓపెనింగ్స్ చాలా బావున్నాయి.

లవ్ స్టోరీ చిత్రాన్ని విడుదల చేయడం చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. కరోనా వైరస్ ముందు పరిస్థితులు వేరు, ప్రస్తుతం పరిస్థతి బాగోలేదు. మేం చాలా ఎదురు చూస్తున్నాం. సినిమాను థియేటర్ల లో మాత్రమే విడుదల చేయాలని అనుకున్నాం. ఓటిటి నుండి మాకు చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ అందుకు సిద్ధంగా లేము. ఎందుకంటే ఇలాంటి సినిమా థియేటర్ల లోనే చూడాలి. చాలా డిఫెరెంట్ గా ఉంటుంది. ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ముల చాలా బాగా తీశారు. నటీనటులు కూడా చాలా బాగా చేశారు. అందుకే మేము థియేటర్ల లో విడుదల చేయాలని అనుకున్నాం.

లవ్ స్టోరీ మీద చాలా సినిమాలు వచ్చాయి.

ప్రెజెంటేషన్ డిఫెరెంట్. ప్రతి ఒక్కరి ప్రెజెంటేషన్ డిఫెరెంట్ గా ఉంటుంది. లవ్ స్టోరీ లు చాలా ఉంటాయి. కానీ శేఖర్ కమ్ముల ఎంత సెన్సిటివ్ గా టచ్ చేస్తారు అనేది ఇందులో కూడా డిఫెరెంట్.

ఓవర్సీస్ లో ఎక్కువగా థియేటర్లు ఓపెన్ లో లేవు. ఉన్న ప్రాంతాల్లో రిలీజ్ చేస్తున్నాం. రిస్క్ తీసుకుంటున్నాం. బట్ ఓకే. కేరళ లో ఈ సినిమా ను రిలీజ్ చేయడం లేదు. మలయాళం లో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నాం.

బాలీవుడ్, టాలీవుడ్, మరెక్కడైనా మీరు బాగా కనెక్ట్ అయిన లవ్ స్టోరీ?

నాగేశ్వర రావు ప్రేమాభిషేకం. ఇంకా కొన్ని చిత్రాలు.

ఈ సినిమా ఇండస్ట్రీ క్లోజ్ అయ్యే ఛాన్స్ లేదు. ఇంకా ఇప్పుడు ఉన్న పరిస్థితికి మూడు రెట్లు పెద్దగా అయ్యే అవకాశం ఉంది. మనీ కూడా ఎక్కువ గా వస్తుంది. ఆన్లైన్ ద్వారా టికెట్ బుకింగ్ ఆప్షన్ కేవలం ఆంధ్ర లో మాత్రమే కాదు, ఇండియా మొత్తం ఉంది. ఆన్లైన్ టికెటింగ్ ద్వారా నిర్మాత సేఫ్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం కూడా రెవెన్యూ వాళ్ళ సంతోషం గా ఉంటుంది. ఇక్కడ 80 శాతం థియేటర్లు కూడా ఆన్లైన్ ద్వారా టికెట్స్ అమ్ముతున్నారు.

అంతేకాక ఇండియా లో మాత్రమే కాకుండా, ప్రపంచం లో అన్ని చోట్ల కంటే కూడా ఆంధ్ర లో చాలా తక్కువగా ఉన్నాయి రైట్స్. అందుకే మరొకసారి 20 వ తేదీన చర్చించనున్నారు.

నాగ చైతన్య గారితో చేయడం చాలా ఫెంటాస్టిక్ గా అనిపించింది. ఎప్పుడు రమ్మంటే అప్పుడు, ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు వచ్చారు. అతి త్వరలో ఆయనతో మరొక సినిమా ప్రకటిస్తాం. ఆ రిలేషన్ ఉంది అతనితో మాకు. మేము ఇంకా పడి సినిమాల వరకు ప్లాన్ చేస్తున్నాం.

గుడ్ ఎంటర్ టైన్మెంట్ ఫిల్మ్, చాలా బావుంటుంది. శేఖర్ కమ్ముల ఒక ఫ్యామిలీ మ్యాన్, ప్రతి ఒక్కరూ ధియేటర్ కి వచ్చి మా సినిమా చూడండి.

ధనుష్, శివ కార్తికేయన్ లతో అగ్రిమెంట్ ఉంది. వారితో సినిమాలు చేస్తున్నాం. ఇలా మరో ఎనిమిది మంది హీరోలతో అగ్రిమెంట్ ఉంది. వచ్చే ఏడాది వరకు ఈ సినిమాలను విడుదల చేయనున్నాం. నాగర్జున, నాగ శౌర్య, సుధీర్ బాబు లతో సినిమాలు చేస్తున్నాం.

సంబంధిత సమాచారం :