“లవ్ స్టోరీ” రిలీజ్‌ డేట్‌పై సరికొత్త టాక్..!

Published on Sep 9, 2021 1:04 am IST


అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ చిత్రాల స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “లవ్ స్టోరీ”. మంచి అంచనాలు ఉన్న ఈ చిత్రం ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు థియేటర్లు మళ్లీ తెరుచుకోవడంతో సెప్టెంబర్ 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు తొలుత ప్రకటించారు.

కానీ కొన్ని కారణాల వలన ఈ సినిమా విడుదలను మళ్ళీ వాయిదా వేశారు. ఇప్పటివరకు ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌పై మాత్రం క్లారిటీ రాలేదు. తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమాను అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారని తెలుస్తుంది. మరీ కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఎప్పుడు రివీల్ చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :