యూఎస్ బాక్సాఫీస్ వద్ద “లవ్ స్టోరీ”కి అదిరిపోయే కలెక్షన్స్..!

Published on Sep 27, 2021 10:22 pm IST


అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ చిత్రాల స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన “లవ్ స్టోరీ” సినిమా సెప్టెంబర్‌ 24న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్‌ని తెచ్చుకున్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన పెద్ద సినిమా ఇదే. అయితే థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా? కలెక్షన్లు ఎలా ఉంటాయన్న అనుమానాలను ఈ సినిమా పటాపంచలు చేసిందనే చెప్పాలి. తొలిరోజే ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టినట్టు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే యూఎస్‌ బాక్సాఫీసు వద్ద కూడా ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్లను రాబట్టినట్టు సమాచారం. కేవలం 3 రోజుల్లోనే ఈ సినిమా 1 మిలియ‌న్ డాల‌ర్ల (రూ.7 కోట్ల 37 ల‌క్ష‌లు) వసూళ్లు రాబట్టిందట. 2021లో అత్య‌ధిక గ్రాస్ సాధించిన తెలుగు సినిమాగా ‘ల‌వ్‌స్టోరీ’ నిలిచింది. ఇకపోతే లవ్‌స్టోరీ సినిమా తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 10 కోట్లను వసూళ్లు చేసిందట. ట్రేడ్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం తొలిరోజు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ సినిమాకు అటు ఇటుగా రూ. 6 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయని, యూఎస్‌లో 2.9 కోట్ల వసూళ్లను రాబట్టిందని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :