మరికొద్ది గంటల్లో “లవ్ స్టోరీ” రిలీజ్ డేట్ తేలిపోనుంది..!

మరికొద్ది గంటల్లో “లవ్ స్టోరీ” రిలీజ్ డేట్ తేలిపోనుంది..!

Published on Aug 18, 2021 1:00 AM IST

అక్కినేని నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్‌గా ఫీల్ గుడ్ చిత్రాల స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “లవ్ స్టోరీ”. ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే గత నెలలో సినిమా థియేటర్లు మళ్లీ తెరుచుకోవడం చిన్న చిన్న సినిమాలు వరుసపెట్టి విడుదల అవుతుండడంతో, ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ రోజు ఉదయం (ఆగష్ట్ 18) 11:07 నిమిషాలకు ఈ సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటించబోతున్నట్టు చిత్ర బృందం అధికారికంగా అనౌన్స్ చేసింది. అయితే వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ఓ అభిప్రాయానికి వచ్చారని టాక్ వినిపిస్తుంది. మరీ ఇదే డేట్‌ని ప్రకటిస్తారా లేక మరేదైనా కొత్త డేట్ ప్రకటిస్తారా అన్నది మరి కొద్ది గంటల్లో తేలిపోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు