ట్రైలర్ తో ఆకట్టుకుంటున్న ‘లవ్ స్టోరీ’ !

Published on Sep 13, 2021 11:29 am IST

అక్కినేని నాగచైతన్య – క్రేజీ బ్యూటీ సాయి పల్లవిల ‘లవ్ స్టోరీ’ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ సినిమా పై అంచనాలను రెట్టింపు చేసింది. సున్నితమైన ప్రేమ కథతో శేఖర్ కమ్ముల మరోసారి హృదయాన్ని తాకేలా సినిమాని తెరకెక్కించినట్లు ట్రైలర్ ను చూస్తే అర్ధమవుతుంది.

ఇక ఈ సినిమాలో ఎమోషన్ కూడా చాలా బాగా హైలైట్ అయింది. అలాగే సినిమాలో రావు రమేశ్ .. దేవయాని .. ఈశ్వరీరావు ముఖ్యమైన పాత్రలను పోషించారు. కాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చైతన్య , సాయిపల్లవి ఇద్దరు తెలంగాణ యాసలో మాట్లాడనున్నారు.

కాగా కరోనా కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. నిజానికి ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదల కావాల్సింది. కానీ ఈ లవ్ స్టోరీ సినిమా ఈ నెల 24న విడుదలకానుంది.

 

థియేట్రికల్ ట్రైలర్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :