టాలివుడ్ టాప్ 5 మోస్ట్ లైక్డ్ ట్రైలర్స్ లో “లవ్ స్టోరీ”

Published on Sep 14, 2021 5:00 pm IST

అక్కినేని నాగ చైతన్య మరియు సాయి పల్లవి హీరో హీరోయిన్ లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం లవ్ స్టోరీ. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 24 వ తేదీన థియేటర్ల లోకి తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు అందుకు సంబంధించిన ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ షురూ చేసింది. ఈ చిత్రం నుండి అయిన ప్రచార చిత్రాలు మరియు పాటలు సినిమా పై ఆసక్తి రేకెత్తించగా, తాజాగా విడుదల అయిన ట్రైలర్ సినిమా పై మరింత ఆసక్తి పెంచేలా ఉంది.

తాజాగా విడుదల అయిన ట్రైలర్ కి సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ వస్తోంది. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. యూ ట్యూబ్ లో ఇప్పటి వరకూ 5 మిలియన్ ప్లస్ వ్యూస్ కి పైగా సాధించడం జరిగింది. అంతేకాక 24 గంటల్లో 342కే లైక్స్ ను సొంతం చేసుకుంది. టాలీవుడ్ లో టాప్ ఫైవ్ లైక్స్ వచ్చిన ట్రైలర్ లలో లవ్ స్టోరీ చేరడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతోంది. వకీల్ సాబ్, బాహుబలి, సాహో, సరిలేరు నీకెవ్వరు ల తర్వత 24 గంటల్లో ఎక్కువ లైక్స్ సాధించిన ట్రైలర్ గా లవ్ స్టోరీ ఉంది. ఈ మేరకు అక్కినేని అభిమానులు, ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :