“లవ్ స్టోరీ” ట్రైలర్‌కి ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వస్తుందిగా..!

Published on Sep 14, 2021 3:00 am IST


అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ చిత్రాల స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “లవ్ స్టోరీ”. కరోనా కారణంగా వాయిదాపడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు మొన్న వినాయక చవితి సందర్భంగా కొత్త రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేసుకుంది. ఈ నెల 24వ తేదిన ఈ సినిమా విడుదల కాబోతుంది. అయితే తాజాగా నిన్న ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం.

ట్రైలర్‌లో శేఖర్ కమ్ముల మార్క్ కనిపించడంతో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ట్రైలర్ విడుదలైన కొద్ది గంటల్లోనే 4 మిలియన్ ప్లస్ వ్యూస్‌ని రాబట్టడమే కాకుండా, 300K ప్లస్ లైక్స్‌ని కొల్లగొట్టింది. ట్రైలర్ చూశాక సినిమాపై ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలు పెరిగాయనే చెప్పాలి.

సంబంధిత సమాచారం :