రెండు రోజులు తెలుగు స్టేట్స్ లో “లవ్ స్టోరీ” సూపర్ వసూళ్లు!

Published on Sep 26, 2021 2:00 pm IST

ఎన్నో అంచనాలు నడుమ లేటెస్ట్ గా టాలీవుడ్ లో రిలీజ్ అయ్యిన చిత్రం “లవ్ స్టోరీ”. దర్శకుడు శేఖర్ కమ్ముల అక్కినేని హీరో నాగ చైతన్య మరియు సాయి పల్లవిల కాంబోలో తెరకెక్కించిన ఈ చిత్రం ఎప్పుడు నుంచో రిలీజ్ కి వాయిదా పడుతూ వస్తుంది. మరి ఎట్టకేలకు భారీ అంచనాలు నడుమ మొన్ననే రిలీజ్ అయ్యి సాలిడ్ వసూళ్లు కూడా డే 1 కి రాబట్టింది. అయితే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వసూళ్లు ఏరియాల వారీగా పి ఆర్ నంబర్స్ ను చూసినట్లయితే..

నైజాం – రూ .5.6 కోట్లు
సీడెడ్ – రూ 1.85 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ 1.43 కోట్లు
గుంటూరు – రూ. 0.82 కోట్లు
కృష్ణ – రూ. 0.47 కోట్లు
తూర్పు – రూ. 0.76 కోట్లు
పశ్చిమ – రూ. 0.74 కోట్లు
నెల్లూరు – రూ. 0.38 కోట్లు

మొత్తం 2 -రోజుల తెలుగు రాష్ట్రాల షేర్ – రూ .12.05 కోట్లు వచ్చింది. జస్ట్ రెండు రోజులకి ఇది మంచి రాబడి అని చెప్పాలి. అలాగే ఇప్పుడు ఆదివారం కూడా ఖచ్చితంగా మంచి నంబర్స్ కొల్లగొట్టడం ఖాయం అని చెప్పొచ్చు. మొత్తానికి మాత్రం ఈ సినిమా ఫైనల్ రన్ లో కంప్లీట్ టార్గెట్ ను ఈజీగా చేజ్ చేసేలా ఉందని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం :