టాక్..చైతు కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ అవుతుందట!

Published on Sep 24, 2021 10:00 pm IST


ఇప్పుడు టాలీవుడ్ సహా ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర తెలుగు ఆడియెన్స్ లో “లవ్ స్టోరీ” సినిమా కోసమే హాట్ టాపిక్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం విపరీతమైన అంచనాల నడుమ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. అంతే కాకుండా రెండో వేవ్ తర్వాత ఇండియన్ సినిమా దగ్గర ఇదే పెద్ద రిలీజ్ కావచ్చు.

మరి అన్నీ కలిసి ఈ సినిమాని మరో స్థాయి అంచనాల్లో నిలబెట్టడంతో ఖచ్చితంగా ఈ సమయంలో కూడా భారీ అంచనాలు రావచ్చని ఇప్పుడు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సినిమా డే 1 వసూళ్లు అయితే చైతు కెరీర్ లోనే ది బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ గా వస్తాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఆల్రెడీ యూఎస్ సహా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకి సాలిడ్ బుకింగ్స్ జరిగాయి. దీనితో చైతూ కెరీర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలవడం ఖాయం అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :