వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన “లవ్ స్టోరీ”

Published on Dec 12, 2021 3:28 pm IST


నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్ లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా లవ్ స్టోరీ. అమిగోస్ క్రియేషన్స్ మరియు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి పవన్ సిహెచ్ సంగీతం అందించారు. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ఘన విజయం సాధించింది. ప్రేక్షకులని, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

ప్రస్తుతం ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అయింది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు స్టార్ మా లో లవ్ స్టోరీ ప్రసారం కానుంది. బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రం బుల్లితెర ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :