తెలుగు స్టేట్స్ లో “లవ్ టుడే” 5 రోజుల వసూళ్ల ఇవే.!

తెలుగు స్టేట్స్ లో “లవ్ టుడే” 5 రోజుల వసూళ్ల ఇవే.!

Published on Nov 30, 2022 12:00 PM IST

రీసెంట్ గా తమిళ నాట భారీ సక్సెస్ అయినటువంటి చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు అలాగే దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా అలాగే తన స్వీయ దర్శకత్వంలోనే తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “లవ్ టుడే”. మరి అక్కడ భారీ విజయం కొనసాగుతుండగానే తెలుగులో కూడా రిలీజ్ కి తీసుకురాగా తెలుగు లో కూడా ఈ చిత్రం సూపర్ ఓపెనింగ్స్ తో అదరగొట్టింది.

ఇక ఇప్పుడు తెలుగు స్టేట్స్ లో ఈ చిత్రం ఐదు రోజులు థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ ని కంప్లీట్ చేసుకోగా మరి ఈ చిత్రం ఐదవ రోజు 90 లక్షల నెట్ వసూళ్లు రాబట్టగా మొత్తం ఈ 5 రోజుల్లో ఏపీ తెలంగాణ నుంచి ఈ చిత్రం 7.4 కోట్ల నెట్ వసూళ్లతో వీక్ డేస్ లో కూడా అదరగొడుతూ దూసుకెళ్తుంది. ఇక ఈ చిత్రంలో ఇవానా హీరోయిన్ గా నటించగా యోగిబాబు, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు