వైరల్ వీడియో: వరిసు హిట్ ట్రాక్‌కి లవ్ టుడే నటి స్టెప్పులు!

వైరల్ వీడియో: వరిసు హిట్ ట్రాక్‌కి లవ్ టుడే నటి స్టెప్పులు!

Published on Dec 1, 2022 12:00 PM IST

ఇటీవల కోలీవుడ్ చిత్రం లవ్ టుడేలో తన నటనకు ఇవానాకు విపరీతమైన పేరు వచ్చింది. ఆ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తాజాగా ఆమె చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నటి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో డ్యాన్స్ వీడియోను పోస్ట్ చేసింది. ఆమె వరిసులోని సూపర్ హిట్ ట్రాక్ అయిన రంజితమేకి అద్దిరిపోయే డాన్స్ చేసింది.

ఆజిద్ ఖలిక్ (రేవి) మరియు నవీన్ క్రుభాకర్ (మామకుట్టి) కూడా ఆమెతో పాటు డ్యాన్స్ వీడియోలో ఉన్నారు, ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఈ హీరోయిన్ త్వరలో టాలీవుడ్ లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఆశిష్ రెడ్డి యొక్క సెల్ఫిష్‌లో కథానాయికగా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీమ్ నుంచి ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు