వైరల్ : ఆ డైరెక్టర్ కి “లవ్ టుడే” దర్శకుడు స్పెషల్ థాంక్స్.!

Published on Dec 1, 2022 8:00 am IST

లేటెస్ట్ గా తమిళ్ మరియు తెలుగులో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయినటువంటి చిత్రం “లవ్ టుడే”. చిత్రంలో హీరోగా నటించిన ప్రదీప్ రంగనాథన్ నే ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించగా తెలుగులో కూడా ఈ చిత్రం మంచి వసూళ్లు అందుకుంది. అయితే ఇంత మంచి సక్సెస్ అందుకొని దూసుకెళ్తున్న ఈ సమయంలో ఈ యంగ్ దర్శక హీరో పెట్టిన ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్ గా మారింది.

ఈ “లవ్ టుడే” టైటిల్ పెట్టే ప్రాసెస్ లో నేను దాన్ని క్రియేట్ చేసిన ఒకరికి థాంక్స్ చెప్పడం మర్చిపోయాను. వారు 1997 లోనే ఈ లవ్ టుడే అనే టైం లెస్ టైటిల్ ని క్రియేట్ చేసిన దర్శకుడు బాల శేఖరన్ గారు, ఇలాంటి ఓ టైటిల్ ని ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాని” ఈ దర్శకుడు అయితే తెలిపాడు. దీనితో ఈ సక్సెస్ లో తన ట్వీట్ ఈ సినిమా లవర్స్ లో మంచి వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం :