టాక్..దళపతితో “లవ్ టుడే” డైరెక్టర్.?

టాక్..దళపతితో “లవ్ టుడే” డైరెక్టర్.?

Published on Dec 11, 2022 6:16 PM IST

ఇళయ దళపతి విజయ్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న “వారసుడు” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రాన్ని దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తమిళ నాట భారీ అంచనాలు అయితే నెలకొల్పుకుంది. ఇక నెక్స్ట్ కూడా విజయ్ నుంచి మరింత సాలిడ్ లైనప్ కూడా రెడీగా ఉండగా వాటిలో నెక్స్ట్ అయితే దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ తో తన సినిమాటిక్ యూనివర్స్ లో చేయనున్నట్టు తెలిసిందే.

ఇక ఈ సినిమా తర్వాత అయితే ఓ యంగ్ డైరెక్టర్ తో తాను చేయనున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. రీసెంట్ బ్లాక్ బస్టర్ హిట్ లవ్ టుడే హీరో సహా దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ విజయ్ కి ఓ స్టోరీ నరేట్ చెయ్యగా దానికి విజయ్ ఓకే చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. మరి దీనిపై అయితే అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికి ఈ క్రేజీ కాంబినేషన్ కూడా మంచి ఆసక్తిగా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు