డిజిటల్ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకున్న “లవ్ టుడే”

డిజిటల్ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకున్న “లవ్ టుడే”

Published on Nov 9, 2022 12:00 PM IST

ఇటీవల విడుదలైన తమిళ బ్లాక్‌బస్టర్ చిత్రం లవ్ టుడే తెలుగులో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. ప్రదీప్ రంగనాథన్ ఈ చిత్రం లో హీరోగా నటించడం మాత్రమే కాకుండా దర్శకత్వం వహించారు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ చిత్రం డిజిటల్ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకుంది. ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ ఈ చిత్రం యొక్క డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుంది.

ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో డిజిటల్ రంగ ప్రవేశం చేయనుంది. ఈ చిత్రంలో ఇవానా కథానాయిక గా నటించింది. సత్యరాజ్, రాధికా శరత్‌కుమార్, యోగి బాబు తదితరులు కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. ఈ చిత్రం ను తెలుగు లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు