ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన యూత్ ఫుల్ హిట్ “లవ్ టుడే”.!

Published on Dec 23, 2022 9:00 am IST

కోలీవుడ్ లో ఈ ఏడాది భారీ హిట్స్ అయ్యినటువంటి చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు సహా దర్శకుడు అయినటువంటి ప్రదీప్ రంగనాథన్ తెరకెక్కించిన చిత్రం “లవ్ టుడే” కూడా ఒకటి. మరి ఈ చిత్రంలో తాను హీరోగా నటించగా యంగ్ బ్యూటీ ఇవానా హీరోయిన్ గా నటించింది. ఇక తమిళ నాట సాలిడ్ హిట్ అయ్యిన ఈ చిత్రం అయితే తెలుగులో కూడా రిలీజ్ చేయగా మన దగ్గర కూడా సాలిడ్ వసూళ్లు అందుకొని మరో క్లీన్ హిట్ గా నిలిచింది.

ఇక ఈ చిత్రం అయితే ఇప్పుడు తెలుగు వెర్షన్ లో ఓటిటి లో సందడి చేసేందుకు వచ్చేసింది. ఈ చిత్రం తమిళ్ సహా తెలుగు స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకోగా అందులో నేటి నుంచి అయితే ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది. మరి మరోసారి చూడాలి అనుకునే వారు ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో చూసి ఎంజాయ్ చెయ్యవచ్చు. ఇక ఈ చిత్రంలో సీనియర్ నటులు సత్యరాజ్, రాధికా లు కీలక పాత్రల్లో నటించగా యోగిబాబు కూడా ఓ ఇంట్రెస్టింగ్ రోల్ లో నటించాడు.

సంబంధిత సమాచారం :