కళ్యాణ్ రామ్ కొత్త సినిమాకు బ్యూటిఫుల్ టైటిల్ !

కళ్యాణ్ రామ్ తాజా సినిమాకు ‘నా నువ్వే’ అనే లవ్లీ టైటిల్ ఖరారు చేసారు. జ‌యేంద్ర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ప్యూర్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు పిసి.శ్రీరామ్ కెమెరామెన్. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

ఈ సినిమాతో పాటు కళ్యాణ్ రామ్ ఎంఎల్ఎ సినిమాలో నటిస్తున్నాడు. కాజల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను ఉపేంద్ర మాధవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా మాస్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.