‘స్టార్ హీరో’ డైరెక్షన్ లో ‘సూపర్ స్టార్’ హీరోగా షూట్ కి రెడీ !

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా మరో ‘మలయాళ స్టార్ హీరో’ పృధ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ పొలిటికల్ థ్రిల్లర్ ‘లూసిఫర్’. ఈ మలయాళ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 150 కోట్లు కలెక్ట్ చేసి.. మలయాళ సినీ పరిశ్రమలో కొత్త రికార్డ్స్ సృష్టించింది. కాగా ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉన్న ఈ సీక్వెల్ వచ్చే వారం షూట్ కి వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకుంటుందట.

ఈ చిత్ర దర్శకుడు పృథ్వీరాజ్‌ ఇప్పటికే మోహన్ లాల్ కి ఫుల్ స్క్రిప్ట్ వినిపించాడట. స్క్రిప్ట్ మోహన్ లాల్ కి బాగా నచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ కి చెందిన మరికొంత మంది తారలు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారట. ఇక ‘లూసిఫర్’ మొదటి పార్ట్ లో స్టీఫెన్ గట్టుపల్లి అనే పాత్రలో నటించిన మోహన్ లాల్ ఎప్పటిలాగే, తన నటనతో ఈ సినిమాలో ఉత్తమమైన నటనను కనబర్చారు. మరి సీక్వెల్ లో మోహన్ లాల్ ఎలాంటి పాత్రలో కనిపిస్తారో చూడాలి.