ఓటీటీ వేదిక : నెట్‌ఫ్లిక్స్
ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ : సెప్టెంబర్ 18, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : రాధికా ఆప్టే, కొంకణా సేన్ శర్మ, సిద్ధార్థ్, అదితి రావు హైదరీ, విజయ్ వర్మ తదితరులు
దర్శకత్వం : విక్రమాదిత్య మోత్వానే, కిరణ్ రావు, శకున్ బాత్రా, విశాల్ భరద్వాజ్
నిర్మాతలు : రోనీ స్క్రూవాలా, ఆషి దువా సారా
సంగీతం : స్నేహ ఖన్వల్కర్, రామ్ సంపత్, యష్ సహాయ్, విశాల్ భరద్వాజ్, నీల్ అధికారి
ఛాయాగ్రహణం : సిద్ధార్థ్ దివాన్, శ్రేయా దేవ్ డూబే, స్వప్నిల్ సోనావానె, సౌరభ్ గోస్వామి
కూర్పు : తాన్య ఛబ్రియా, సంయుక్తా కాజా, నితిన్ బెయిడ్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
నెట్‌ఫ్లిక్స్‌లో ప్రాచుర్యం పొందిన బోల్డ్ ఆంథాలజీ సిరీస్ చిత్రం ‘లస్ట్ సోరీస్’ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీ నుంచి తాజాగా ‘లస్ట్ స్టోరీస్ 3’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. మరి ఈ మూడో సీజన్ ఆంథాలజీ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.
కథ:
గత భాగాల తరహాలోనే ఇది కూడా నాలుగు వేర్వేరు కథలతో సాగుతుంది. మోడ్రన్ సమాజంలో ప్రేమ, వ్యామోహం, పెళ్లి బంధంలో వచ్చే ఒడిదుడుకులు మరియు దాంపత్య జీవితంలోని సంక్లిష్టతలను విభిన్న కోణాల్లో చూపించే ప్రయత్నం చేశారు. ఒక్కో కథలోనూ వేర్వేరు పాత్రలు, వారి వ్యక్తిగత జీవితాలు, లైంగిక కోరికలు మరియు వారి నిర్ణయాలు ఎలాంటి పరిణామాలకు దారితీశాయి? అనే అంశాల చుట్టూ ఈ కథలు తిరుగుతాయి.
ప్లస్ పాయింట్స్:
ఈ సినిమాలోని ప్రధాన పాత్రల్లో నటించిన నటీనటులందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఎమోషనల్ సీన్స్, బోల్డ్ సీన్స్‌లను ఎక్కడా సరిహద్దులు దాటకుండా సహజంగా పండించారు. కొంకణా సేన్ శర్మ, రాధికా ఆప్టే, సిద్ధార్థ్, అదితి రావు హైదరీ తమ పాత్రల్లో ఒదిగిపోయి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు.
శకున్ బాత్రా, విక్రమాదిత్య మోత్వానేలు డైరెక్ట్ చేసిన ఎపిసోడ్స్ కాన్సెప్ట్ పరంగా, ఎమోషనల్ డెప్త్ పరంగా చాలా బాగున్నాయి. ప్రతి కథకు సంబంధించిన ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ మరియు నేపథ్య సంగీతం కథల మూడ్‌కి తగినట్లుగా ఆకట్టుకుంటాయి.
కేవలం బోల్డ్ సీన్స్ మీదనే కాకుండా పాత్రల మానసిక సంఘర్షణపై ఎక్కువ దృష్టి పెట్టడం ప్లస్ అయ్యింది. ముఖ్యంగా మనుషుల మనస్తత్వాలను ఆవిష్కరించే తీరు ఆకట్టుకుంటుంది.
మైనస్ పాయింట్స్:
నాలుగు కథల్లో రెండు బాగా ఆకట్టుకున్నప్పటికీ, మిగతా రెండు కథలు ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. కొన్ని ఎపిసోడ్స్ చాలా నెమ్మదిగా సాగుతూ ప్రేక్షకుడి ఓపికకు పరీక్ష పెడతాయి.
ఇక కొన్ని కథల ఎండింగ్ అంత ప్రభావవంతంగా లేకపోవడం మైనస్. ఏదో హడావుడిగా పూర్తి చేసినట్లు అనిపిస్తుంది. గత సీజన్లతో పోలిస్తే కొన్ని ఎపిసోడ్స్‌లో డ్రామా పండకపోవడం వల్ల ప్రేక్షకులు పాత్రలతో పూర్తిగా కనెక్ట్ కాలేరు.
కొన్ని సన్నివేశాలు పాత ఆంథాలజీలను గుర్తుచేస్తాయి. దీని వల్ల ఈ సీజన్‌లో కొత్తదనం లోపించినట్లు ప్రేక్షకులు ఫీల్ అవుతారు.
సాంకేతిక వర్గం:
ఈ ఆంథాలజీ చిత్రంలో దర్శకులు ఎంచుకున్న పాయింట్స్ బాగున్నప్పటికీ, తెరపై ప్రెజెంట్ చేయడంలో పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేకపోయారు. స్క్రీన్‌ప్లే కొన్ని చోట్ల ఫ్లాట్‌గా, చాలా స్లో పేస్‌తో సాగుతుంది. ఎడిటింగ్ విషయంలోనూ ఇంకాస్త బెటర్ వర్క్ చేయాల్సింది. కెమెరా పనితనం రిచ్‌గా ఆకట్టుకుంటుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇందులోని కథల మూడ్‌కి తగినట్లుగా చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఆకట్టుకుంటాయి. తెలుగు డబ్బింగ్ పర్వాలేదు.
తీర్పు:
మొత్తంగా చూసుకుంటే.. ‘లస్ట్ స్టోరీస్ 3’ ఒక బోల్డ్ ఆంథాలజీ డ్రామా చిత్రంగా ప్రేక్షకులను కొంతవరకు మెప్పిస్తుంది. బోల్డ్ అండ్ ఎమోషనల్ కాన్సెప్ట్‌లు, నటీనటుల పర్ఫార్మెన్స్‌లు మరియు నిర్మాణ విలువలు దీనికి ప్లస్ పాయింట్స్. అయితే, కొన్ని కథల్లో పేలవమైన స్క్రీన్‌ప్లే, సాగదీత సన్నివేశాలు నిరాశపరుస్తాయి. బోల్డ్ డ్రామాలు మరియు ఆంథాలజీ చిత్రాలను ఇష్టపడేవారు ‘లస్ట్ స్టోరీస్ 3’ చిత్రాన్ని తక్కువ అంచనాలతో చూడటం బెటర్.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team
