రజనీ కోసం ఉద్యోగాన్ని వదిలిన లైకా ప్రొడక్షన్స్ క్రియేటివ్ హెడ్ !

కొద్దిరోజుల క్రితమే అధికారికంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సూపర్ స్టార్ రజనీకాంత్ కు రోజు రోజుకు సినీ పరిశ్రమ నుండి సపోర్ట్ పెరుగుతూ వస్తోంది. అయన వ్యక్తిత్వం, ఆలోచన విధానం అంటే ఇష్టపడేవాళ్లు ఆయన వెంట నడిచేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే హీరో, దర్శకుడు రాఘవ లారెన్స్ రజనీతో పాటు రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించగా ఇప్పుడు మరొకరు కూడా అయనతో కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యారు.

ఆయనే ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ క్రియేటివ్ హెడ్ రాజు మహాలింగం. లైకా ప్రొడక్షన్స్ రజనీతో కలిసి భారీ చిత్రం ‘2 పాయింట్ 0’ ను నిర్మించింది. అంతేగాక ఆడియో వేడుకను దుబాయ్ లో నిర్వహించి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ ప్రయాణంలో రజనీ ఆలోచనల పట్ల ఆకర్షితమైన తాను లైకాకు రిజైన్ చేసి రజనీతో కలిసి రాజకీయాల్లో పనిచేయనున్నట్లు రాజు మహాలింగం తెలిపారు.