“బాలయ్య 107″లో ఈ సాంగ్ మాములుగా ఉండదట..రచయిత మాట.!

Published on May 18, 2022 7:07 am IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం దర్శకుడు గోపిచంద్ మలినేని తో ఓ భారీ మాస్ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే దీనికి ముందు తాను హీరోగా నటించిన అఖండ చిత్రం భారీ హిట్ కూడా అయ్యింది. దీనితో తన నెక్స్ట్ సినిమాపై మాత్రం భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇదిలా ఉండగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని మేకర్స్ ఓ రేంజ్ లో తెరకెక్కిస్తుండగా ఇప్పుడు ఒక మాస్ సాంగ్ షూట్ లో ఉన్నట్లు గా అనౌన్స్ చేశారు.

అయితే దీనిపై ఒక క్రేజీ సెల్ఫీ ని కూడా రిలీజ్ చెయ్యగా అది మంచి వైరల్ అవుతుంది. ఇక ఈ సెల్ఫీ మరియు ఆ సాంగ్ పై మాట్లాడుతూ ఈ పాటని రాసిన ప్రముఖ సాహిత్య రచయిత అయితే ఈ సాంగ్ మాత్రం మాములుగా ఉండదు అని ముందే అభిమానులకి ప్రామిస్ ఇస్తున్నారు. దీనితో ఈ సాంగ్ పై మాత్రం ఇప్పుడు నుంచే మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి చూడాలి సినిమాలో ఈ సాంగ్ ఎలా ఉంటుందో అనేది. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారని తెలిసిందే.

సంబంధిత సమాచారం :